వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పగిలిన తల, రక్తమోడిన నగరం: కోదండరామ్ పిలుపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: ఖైరతాబాద్ నుండి తెలంగాణ కవాతు కోసం వస్తున్న ఓ తెలంగాణవాది తల పగిలింది. పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెను, బారీకేడ్లను దాటుకొని వచ్చేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ వృద్ధుడి తలకు లాఠీ బలంగా తగలడంతో తీవ్ర గాయమై రక్తం కారింది. అయినప్పటికీ పోలీసులు ఆయనపై లాఠీఛార్జ్ చేయడం గమనార్హం. ర్యాలీగా వస్తున్న పలువురు తెలంగాణవాదులపై పోలీసులు పలుచోట్ల లాఠీఛార్జ్ చేయడం, బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం చేశారు.

మీరు సై అంటే మేమూ సై

పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డితో ఆలేరు శాసనసభ్యుడు బూడిద భిక్షమయ్య గౌడ్ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రాంత మంత్రులు రాజీనామా చేస్తే తాము కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణవాదుల అరెస్టు, పార్లమెంటు సభ్యుల అరెస్టు బాధాకరమన్నారు. తెలంగాణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. తెలంగాణ కవాతుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు.

కిరణ్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్‌కు మానవత్వం లేదని, ప్రజాస్వామ్యాన్ని ఆయన ఖూనీ చేశారన్నారు. ఉద్యమాన్ని అణగదొక్కేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. సహచర ఎంపీల అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పోలీసుల తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని మంద జగన్నాథం అన్నారు.

ఖబర్దార్.. నాగం

కవాతుకు అనుమతిచ్చి అరెస్టులు చేయడం సరికాదని నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. పోలీసులు, ప్రభుత్వం ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. పంతొమ్మిది రోజులు తెలంగాణవాదులతో పెట్టుకోదల్చుకుంటే ప్రభుత్వం ఇలాగే వ్యవహరించవచ్చునన్నారు. జీవ వైవిధ్య సదస్సుకు అనుమతించిన ప్రభుత్వం కవాతు కోసం ర్యాలీని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.

సంయమనం పాటించండి.. కోదండరామ్

సంయమనం పాటించాలని తెలంగాణవాదులకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. మనం సమ్మక్క-సారక్క వారసులమని, తెలంగాణవాదులు దౌర్జన్యాలకు పాల్పడరని, మీడియా జోలికి వెళ్లవద్దని సూచించారు. తెలంగాణ ప్రజలు సంస్కారవంతులని, కవాతును విజయవంతం చేయాలని, వేదిక పైనుండి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

English summary
Bharatiya Janatha Party and CPI are started rally for Telangana march from Indira Park of Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X