వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోదాల్లో ఏం దొరకలేదు: జగన్ కేసులో సిబిఐ, మరిన్ని

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI Logo
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతిలోకి వచ్చిన పెట్టుబడులు, ప్రస్తుతం ఆ సంస్థకు చెందిన మీడియాలోకి వస్తున్న డబ్బు గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ.. కొన్ని సంస్థల్లో తనిఖీలు చేసేందుకు అనుమతి కోరిన సిబిఐ, పని పూర్తయినట్లు సిబిఐ కోర్టుకు నివేదిక ఇచ్చింది. సోదాల్లో తమకు బలమైన ఆధారాలు ఏమీ దొరకలేదని తెలిపింది.

ఈ మేరకు నాంపల్లి సిబిఐ కోర్టుకు సోమవారం సెర్చ్ రిపోర్టును సిబిఐ ఉన్నతాధికారులు రహస్యంగా అందజేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. కోర్టు అనుమతితో తాము జీడిమెట్లలోని కెఐజె ప్లాస్టిక్స్, గ్రీన్ ట్రేడ్ కంపెనీల్లో ఈ నెల 5న సోదాలు చేశామని, కానీ, అక్కడ తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. ఈ మేరకు కోర్టుకు నివేదిక అందిస్తున్నామని సిబిఐ కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పేర్కొంది.

వాస్తవానికి జగతిలోకి పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఆయా కంపెనీల్లో తనిఖీలు చేసేందుకు పెద్ద కసరత్తే చేసింది. 4న ఈడి జగతి, మరికొన్ని సంస్థల ఆస్తులను జప్తు చేసినప్పుడే, నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చిన ఉన్నతాధికారి ఒకరు నేరుగా అనుమతి పత్రాలను కోర్టుకు అందజేసి, ఆమోదింపజేసుకున్నారు.

ఆ విషయం రెండో రోజుకు కానీ బయట ప్రపంచానికి తెలియలేదు. సోమవారం సెర్చ్ రిపోర్టును తిరిగి కోర్టుకు ఇవ్వడం ద్వారా, అప్పుడు సిబిఐ తనిఖీలు చేసిందన్న విషయం నిర్ధారణ అయింది. అయితే సిబిఐ... మరిన్ని కంపెనీలపైనా సోదాలు చేసే అవ కాశం ఉన్నట్లు న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి.

English summary
CBI told to Nampally special court on Monday that nothing they found in the searches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X