అల్లుడామజాకా: జగన్‌తో రాబర్ట్‌వాద్రాను పోల్చిన బాబు

Chandrababu Naidu
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఇద్దరూ ఒకే టైప్ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ఆయన అనంతపురం జిల్లాలో తొమ్మిదో రోజు తన పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఇక్కడ జగన్, అక్కడ వాద్రా ఒకేవిధంగా ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు. అల్లుడా మజాగా అని నిరూపించారని వాద్రాను ఉద్దేశించి అన్నారు. అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన ప్రజల సొమ్మును వీరు అవినీతికి పాల్పడి కొట్టేశారన్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు చూసి తనకు నిద్ర పట్టడం లేదని, అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ నేతలకు ఎలా నిద్ర పడుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అనంతపురంలో చెక్ డ్యాంలు నిర్వహించామని, వాటి వల్లే ఇప్పుడు సాగు జరుగుతోందన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. తాను దోచుకున్న దానిలో కొంత మేర ఖర్చు చేసినా రాష్ట్రంలో భూగర్భ జలాలు మెరుగయ్యేవి అన్నారు. కాగా అంతకుముందు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర తొమ్మిదో రోజు బెళుగప్ప మండలం విరుపావల్లి నుండి ప్రారంభమైంది. 11 గంటల తర్వాత శీర్పి చేరుకొని తోటలు సాగు చేస్తున్న రైతుల సదస్సులో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+