రోడ్డు ప్రమాదంలో వైయస్ వివేకానందరెడ్డికి గాయాలు

ఈ ప్రమాదంలో వైయస్ గన్‌మెన్‌కు, కారు డ్రైవల్ లక్ష్మీ నారాయణకు కూడా గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. వారికి తొలుత వేంపల్లిలో ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత కడప ఆసుపత్రికి తరలించారు. మూలమలుపు వద్ద ఎలాంటి ప్రమాద సూచికలు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వివేకా పులివెందుల నుండి కడప వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కాగా వైయస్ వివేకానంద రెడ్డి కొద్దికాలం క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వివేకా మొదటి నుండి కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వేరు కుంపటి పెట్టినప్పటికీ వివేకా కాంగ్రెసులోనే కొద్దికాలం కొనసాగారు. అయితే ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలోని కొందరు నేతలు తన సోదరుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన కాంగ్రెసును వీడారు.












Click it and Unblock the Notifications