బొమ్మలతో సెక్స్ చేయాలని యూనివర్సిటీలో ర్యాగింగ్!

పలువురు సీనియర్ విద్యార్థులు తమ జూనియర్లకు బొమ్మతో అన్ నేచరల్ సెక్స్ చేసినట్లుగా యాక్ట్ చేయాలని ఆదేశించారు. బ్లో అప్ డాల్స్‌తో జూనియర్లను ప్రకృతి విరుద్దమైన శృంగారంలో పాల్గొనేలా ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు సిట్ అప్స్ కూడా చేయాలని ఒత్తిడి తెచ్చారు. బాధిత విద్యార్థులు ఇందుకు సంబంధించిన వీడియోలను పోలీసులకు చూపించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద సీనియర్లపై కేసు పెట్టారు. వారిని వెంటనే హాస్టల్ నుండి సస్పెండ్ చేశారు. విశ్వవిద్యాలయ చీఫ్ ప్రొక్టర్ ప్రొఫెసర్ మతంబర్ తివారి.. తాము జూనియర్లను ర్యాగింగ్ చేసిన పదిమంది సీనియర్లను హాస్టల్ నుండి సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
అందిన సమాచారం మేరకు... గత నెల 21వ తేదిన 18 మంది ఫ్రెషర్స్ హాస్టల్‌లో జాయిన్ అయ్యారు. అప్పటి నుండే సీనియర్లు వారిపై ప్రకృతి విరుద్ద శృంగారానికి ఒత్తిడి తీసుకు వచ్చారు. ఈ నెల 3వ తేదిన 12 జూనియర్ విద్యార్థులు హాస్టల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే విద్యార్థులు వీడియో ఆధారాలు చూపించిన తర్వాతనే చర్యలు తీసుకున్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications