తెలంగాణ: ప్రణబ్‌తో షిండే భేటీ, రేణుకా వ్యాఖ్య

అయితే, తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు కదులుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రపతితో షిండే భేటీ జరిగిందని చెబుతున్నారు. గురువారం జరిగిన కాంగ్రెసు పార్టీ సమావేశానికి షిండే హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడినట్లు కూడా సమాచారం.
తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెసు అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని కలిశారు. కిరణ్ కుమార్ రెడ్డితో ఆ ఇరువురు నాయకులు కూడా తెలంగాణపై మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణపై ఇప్పటికే సోనియా గాంధీ రాష్ట్రపతితో మాట్లాడినట్లు చెబుతున్నారు.
మంగళవారంనాడు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుకు హాజరు కావడానికి వచ్చిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తెలంగాణ సెగ ఏదో మేరకు తగిలింది. తెలంగాణ ఉద్యమకారులనే కాకుండా పలువురు శాసనసభ్యులు పోలీసులు ప్రధాని పర్యటన సందర్బంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటనకు తెలంగాణ మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించలేదు.
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వాదన మరో విధంగా ఉంది. జరిగే భేటీలన్నీా తెలంగాణ కోసమేనని అనుకోవడం సరి కాదని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం రావాలని తాను కూడా కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications