'హేమశ్రీకి లవర్‌ని కాదు, సినిమాలపై ఆమెకు ఆసక్తి'

Hemashri
బెంగళూరు: తాను హేమశ్రీకి స్నేహితుడినే కాని ప్రియుడిని కాదని టివి నటి హేమశ్రీ మృతి కేసులో ఆమె స్నేహితుడు మంజనాథ్ పోలీసులకు తెలిపారు. మంజునాథ్ హేమశ్రీ తనతో మాట్లాడిన మాటల్ని రాకార్డ్ చేసి మీడియాకు అందించాడు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు తాను కేవలం స్నేహితుడినే అని చెప్పాడు. తన తల్లిదండ్రులు, భర్త తనను వేధిస్తున్నారని, భర్త నుండి ప్రాణహాని ఉందని హేమశ్రీ తనతో చెప్పిందని చెప్పాడు.

హేమశ్రీకి సినిమాలపై బాగా ఆసక్తి ఉండేదని, ఆమెకు సినిమాను నిర్మించాలనే కోరిక కూడా ఉండేదని, ఇందుకోసం ధనవంతుడైన వ్యక్తిని పెళ్లాడాలని చెప్పేదని తెలిపాడు. ఆ సమయంలోనే సురేంద్రబాబు సంబంధం వచ్చిందని, తొలుత ఆమె సరేననడంతో తల్లిదండ్రులు ఆ సంబంధాన్ని ఖరారు చేశారని, అయితే అతని వయస్సు 48 ఏళ్లని తెలియడంతో హేమశ్రీ ఆ తర్వాత పెళ్లికి నిరాకరించిందని, పెళ్లి జరగకపోతే తమ పరువు పోతుందని తల్లిదండ్రులు భావించడంతో ఆమె అయిష్టంగా పెళ్లి చేసుకుందని చెప్పారు.

పెళ్లి తర్వాత భర్తతో అంటీముట్టనట్లుగా ఉండేదని మంజునాథ్ పోలీసులకు చెప్పాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరగడంతో మరో పెళ్లికి హేమశ్రీ సిద్ధపడిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా హేమశ్రీ మృతి కేసులో ప్రధాన నిందితుడైన భర్త సురేంద్రబాబును పూర్తిగా విచారించేందుకు మరో నాలుగు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని హెబ్బాల పోలీసులు కోరున్నారు.

హేమశ్రీ మృతికి సంబంధించిన విస్రా ఫోరెన్సిక్ నివేదిక తమకు ఇంకా అందలేదని పోలీసులు గురువారం తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు. కాగా బుధవారం కారు డ్రైవర్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. హేమశ్రీ మృతిపై పోలీసులు అతనిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+