బాబు పాదయాత్రలో నారా లోకేష్: నాయకుల సలహాలు

లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో పలువురు నేతలు, ప్రజలు ఆయనను కలుసుకున్నారు. లోకేష్‌ను చూసేందుకు ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు ఆసక్తి కనబరిచారు. టిడిపి యువనేతలు పలువురు లోకేష్‌కు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. టిడిపిలో యువత నిస్తేజంగా మారిందని, వారిలో చైతన్యం తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 2014 ఎన్నికల్లో క్రియాశీలకం కావాలని లోకేష్‌కు సూచించారు. అలా అయితే టిడిపి వైపు యువత మరింత ఆకర్షితమవుతుందని చెప్పారు.
కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర వల్ల స్థానిక ప్రజలకు కొన్ని సమస్యలు పరిష్కారమవుతున్నాయట. చంద్రబాబు వస్తుండంతో ఆయా ప్రాంతాల్లోని స్థానిక సమస్యలు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఆయనకు అవకాశంగా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో కొన్ని పనులు జరుగుతున్నాయట. కాగా సోమవారం చంద్రబాబు పాదయాత్ర కర్నూలు జిల్లా నుండి మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది.












Click it and Unblock the Notifications