నీ భర్తకు బలవంతంగా డైవోర్స్?: షర్మిలపై టిడిపి

అంతేకాక, బ్రదర్ అనిల్ కుమార్‌తో ఆయన భార్యకు బలవంతంగా విడాకులు ఇప్పించి ఆ కుటుంబం ఉసురు పోసుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర అంటూ ప్రజల్లోకి వెళుతున్న షర్మిల తన తండ్రి మాదిరిగానే అక్రమాల కు పాల్పడి కోట్ల సంపాదనకు బాటలు వేసుకుంటారని, షర్మిల చేస్తున్నది వంచన యాత్ర అని ధ్వజమెత్తారు.
విజయమ్మ వ్యాఖ్యలపై టిడిపి సీరియస్
బైబిల్ చేతిలో ఉంటే ధైర్యంగా ఉంటుందన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైబిల్‌లో మత ప్రచారానికి వెళ్తున్నార లేక రాజకీయ ప్రచారానికి వెళ్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకు రావొద్దని హితవు పలికారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుపతి, శ్రీకాళహస్తి, భద్రాచల రాముడి దేవాలయాలను ఒక్కసారి కూడా దర్శించుకోలేదని విమర్శించారు. దేవుడిని మనస్సులో పూజించుకోవాలని, దేవాలయాలకు వెళ్లాలని, అంతేకానీ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవద్దన్నారు. తిరుమల ఏడు కొండలు రెండు కొండలు మాత్రమేనని గతంలో వైయస్ ప్రకటిస్తే ప్రజలు ఎదురు తిరిగారని గుర్తు చేశారు. జగన్ ఎందుకు జైలుకు వెళ్లాలో విజయమ్మ బైబిల్ పైన ప్రమాణం చేసి చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications