బెయిల్ కుంభకోణంలో గాలికి బెయిల్: అయినా జైల్లోనే

ఆయన జైలు నుండి విడుదలయ్యే అవకాశం ఏమాత్రం లేదు. బెయిల్ స్కాంలో బెయిల్ వచ్చినా ఓఎంసి, ఏఎంసి కేసులలో ఆయన నిందితుడుగా ఉన్నారు. దీంతో ఆయనకు బెయిల్ వచ్చినా ఎలాంటి లాభం లేదు. ఇదే కేసులో గతంలో గాలి సోదరుడు గాలి సోమశేఖర రెడ్డి, పట్టాభి రామారావు, ఆయన తనయుడుతో సహా పలువురు షరతులతో కూడిన బెయిల్ పొందారు. తాజాగా గాలికి కూడా వచ్చింది.
కాగా చంచల్‌గూడ జైలులో ఉన్న సమయంలో గాలి జనార్ధన్ రెడ్డి తన బెయిల్ తెచ్చుకునేందుకు తన సోదరుడు, అనుచరుల ద్వారా జడ్జిలకు, ఇతరులకు డబ్బులు ఎర చూపారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దీనిని సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఓఎంసి, ఏఎంసి కేసులను సిబిఐ విచారిస్తోంది.












Click it and Unblock the Notifications