వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌తో ఇండియా క్రికెట్ సిరీస్‌పై శివమెత్తిన బాల్ థాకరే

By Pratap
|
Google Oneindia TeluguNews

Bal Thackeray
ముంబై‌: పాకిస్తాన్‌తో భారత క్రికెట్ సిరీస్‌పై శివసేన అధినేత బాల్ థాకరే శివమెత్తారు. ఇరు దేశాల మధ్య భారత్‌లో జరిగే క్రికెట్ మ్యాచులను అడ్డుకోవాలని ఆయన సోమవారం శివసైనికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక మొదటి పేజీలో ఆయన ప్రకటన అచ్చయింది. గతాన్ని మరిచిపోయి, పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడాలని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటనపై ఆయన గుర్రుమన్నారు.

పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడాలనే షిండే నిర్ణయం సరైంది కాదని ఆయన అన్నారు. గతాన్ని మరిచిపోవాలని షిండే ఎలా చెబుతారని ఆయన అడిగారు. గతాన్ని ఎందుకు, ఏ విధంగా మరిచిపోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ముంబై దాడులను, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రస్తావించారు.

తాను మంచం మీద పడి ఉన్నప్పటికీ షిండే ప్రకటనతో తన రక్తం ఉడికిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కసబ్ పెట్టుకుని మెర్సీ పిటిషన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చిందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పిటిషన్‌ను తోసిపుచ్చాలని ఆయన అన్నారు. షిండే వంటి పరిపక్వత లేని నాయకులు ఉండడం భారతదేశం దురదృష్టమని ఆయన అన్నారు.

పాకిస్తాన్‌ జట్టుతో క్రికెట్ ఆడాలనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)న నిర్ణయంపై ఆయన గతవారం మండిపడ్డారు. దేశానికి అది ద్రోహం చేయడమేనని వ్యాఖ్యానించారు. డబ్బుల కోసం బిసిసిఐ ద్రోహానికి పాల్పడుతోందని, ఈ ద్రోహంలో భారత ఆటగాళ్లు కూడా పాత్రధారులని ఆయన అన్నారు.

English summary
Shiv Sena chief Bal Thackeray, who has long opposed India-Pakistan cricket ties, on Monday asked party activists "not to permit" the forthcoming matches between the two countries anywhere in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X