హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనీ లాండరింగ్‌పై దూకుడు: జగన్‌కు ఈడి నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అప్పీలేట్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమ ఎదుట వచ్చే నెల 17వ తేదిన హాజరు కావాలని ఈడి అప్పీలేట్ అథారిటీ నోటీసులో జగన్‌ను ఆదేశించింది. జగన్‌తో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కూడా ఈడి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 5వ తేదిన తమ ఎదుట హాజరు కావాలని ఎమ్మార్‌‍ను ఈడి ఆదేశించింది.

జగన్‌ను ముగ్గురు ఈడి అధికారులు విచారించనున్నారు. ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో కూడిన ఈడి ప్రశ్నించనుంది. జగన్‌కు ఈడి నోటీసులు పంపించిన నేపథ్యంలో జగన్ ఆస్తుల జఫ్తును ఈడి మరోసారి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం జగన్ ఆడిటర్ విజయ సాయి రెడ్డిని ఈడి ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆయన నుండి పలు కీలక పత్రాలను ఈడి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కోర్టు అనుమతి తీసుకొని జగన్ ఈడి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఈడి 120 రోజుల్లో రూ.51 కోట్ల జప్తు విషయంలో ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.

కాగా విజయసాయి రెడ్డిని ఈడి సోమవారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. అరగంట పాటు ఈ విచారణ సాగింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సమన్లు జారీ కావడంతో విజయసాయి రెడ్డి సోమవారం ఈడి అధికారుల ముందుకు వచ్చారు. ఈడి అధికారులు తనను విచారించడం పూర్తయిందని, తాను హైదరాబాద్ వెళ్లిపోతున్నానని విజయసాయి రెడ్డి విచారణ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఈడి అధికారులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. వాటి వివరాలను ఆయన వెల్లడించలేదు. వైయస్ జగన్ కేసులో మరో విడత ఆస్తులు జప్తు చేయడానికి ఈడి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విజయ సాయిరెడ్డిని విచారించినట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఈడి ఇప్పటికే 52 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. మరో విడత జప్తునకు సిద్ధమవుతూ విజయసాయి రెడ్డిని ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

English summary
ED has served notice to YSR Congress party president YS Jaganmohan Reddy to question him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X