హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిషోర్ చంద్రదేవ్ లేఖ చిచ్చు: మంత్రుల ముప్పేట దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganta Srinivas Rao-Satrucharla Vijaya Ramaraju
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారనే అంశం ఆ పార్టీని ఇంకా కుదిపేస్తోంది. లేఖ రాశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కిషోర్ చంద్రదేవ్ పైన మంత్రులు శత్రుచర్ల విజయ రామరాజు, గంటా శ్రీనివాస రావు మంగళవారం తీవ్రస్థాయిలో వేర్వేరుగా మండిపడ్డారు. కిషోర్ పైన ముప్పేట దాడి జరుగుతోంది.

పవర్ ప్లాంటులలో తనకు వాటాలు ఉన్నాయని కిషోర్ చెప్పడం గర్హనీయమని శత్రుచర్ల అన్నారు. తనకు పవర్ ప్లాంటులలో ఎలాంటి వాటాలు లేవన్నారు. వాటాలు ఉన్నట్లు నిరూపిస్తే తాను ఆత్మహత్యకు సిద్ధమని, నిరూపించని పక్షంలో ఆయన కూడా అందుకు సిద్ధంగా ఉంటారా అని సవాల్ విసిరారు.

మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డిపై, సత్యనారాయణలపై లేనిపోని వ్యాఖ్యలు చేసిన కిషోర్ చంద్రదేవ్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ పై ఏ అర్హతతో లేఖ రాశారో కిషోర్ చెప్పాలని ఆయన అన్నారు. కిరణ్ సమర్ధంగా పాలన చేస్తున్నారని అన్నారు.

కాగా పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణను లిక్కర్ డాన్‌గా, కిరణ్ కుమార్ రెడ్డిని అసమర్థుడిగా పేర్కొంటూ కిషోర్ చంద్రదేవ్ పది నెలల క్రితం సోనియాకు లేఖ రాసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాను ఎలాంటి లేఖలు రాయలేదని కిషోర్ సోమవారం ప్రకటించారు.

English summary
AP minister Satrucharla Vijaya Ramaraju has challenged central minister Kishore Chandra Dev on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X