వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్ ఉరితో సరిపోదన్న మోడీ: అఫ్జల్‌పై బిజెపి ప్రశ్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముంబయి దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ మృతిపై స్పందించారు. కసబ్ ఉరి సరే అఫ్జల్ గురు సంగతేంటని మోడీ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. కసబ్ ఉరిశిక్ష విషయం తెలిసిన మోడీ ట్విట్టర్‌లో ఈ రోజు ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయం అయిన పార్లమెంటుపై 2001లో దాడి చేసిన అఫ్జల్ గురు సంగతేమిటని, ఈ ఘటన కసబ్ దుశ్చర్య కంటే చాలా సంవత్సరాల ముందు జరిగిందని ట్వీట్ చేశారు.

కసబ్ మృతిపై మన రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ నేతలు కూడా స్పందించారు. ఇంద్రసేనా రెడ్డి, విద్యాసాగర రావు, లక్ష్మణ్ తదితరులు స్పందించారు. ఆలస్యంగా అయినా కసబ్‌కు ఉరి సరైనదే అన్నారు. 166 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు అన్నారు. ఇప్పటికే ఎప్పుడో ఈ శిక్ష అమలు చేయాల్సి ఉండెనన్నారు. కసబ్‌ను ఉరి తీయాల్సిందిగా భారతీయులందరూ మొదటి నుండి డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.

ప్రజల డిమాండ్ మేరకే ఉరి తీశారన్నారు. అఫ్జల్ గురు క్షమాభిక్ష దరఖాస్తు రాష్ట్రపతి వద్ద చాలా కాలంగా పెండింగులో ఉందని బిజెపి ఢిల్లీ పెద్దలు ప్రశ్నించారు. ఆ పిటిషన్ కూడా తిరస్కరించి, అతనికి కూడా త్వరగా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ బిజెపి డిమాండ్ చేసింది. కసబ్ ఉరిశిక్షపై ఆర్ఎస్ఎస్, విహెచ్‌పి తదితర హిందూ సంస్థలతో పాటు ముస్లిం వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేశాయి.

కాగా అఫ్జల్ గురు డిసెంబర్ 13, 2001లో పార్లమెంటుపై దాడి చేశాడు. ఈ ఘటనలో పన్నెండు మంది మరణించారు. 2005లోనే అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించారు. 2011 ఆగస్టు 4 నుంచి అతని క్షమాభిక్ష పిటిషన్ పెండింగులో ఉంది. ఈ విషయంపై కసబ్ ఉరి నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ కూడా స్పందించారు. అఫ్జల్ కేసు కూడా వేగంగా పరిష్కరించాలని సూచించారు.

English summary
Gujarat CM Narendra Modi tweeted..''what about Afzal Guru, who attacked parliament, our temple of democracy, in 2001? That offence predates Kasab's heinous act by many years''.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X