నార్వే గొడవ: ఓస్లో కోర్టు తీర్పుపై పైకోర్టులో జంట సవాల్

పిల్లలను మందలించారనే ఆరోపణలతో జైలు పాలైన నార్వేలోని తెలుగు దంపతుల కేసు కొత్త మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ఆ దంపతులు తమ కుమారుడి ఒంటిని కాల్చారని పోలీసులు ఆరోపించారు. వారు తమ ఏడేళ్ల కుమారుడికి వారు వాతలు పెట్టినట్లు పోలీసులు ఆరోపించారు. పిల్లవాడి ఒంటిపై కాల్చిన మరకలు, మచ్చలు ఉన్నాయని, బెల్టుతో కొట్టారని ఓస్లో పోలీసు శాఖ ప్రాసిక్యూషన్ అధిపతి కుర్ట్ లిర్ ఆరోపించారు. కాల్పిన లోహంతో వాతలు పెట్టారని ఆ తెలుగు దంపతులు ఆరోపణలు ఎదుర్కుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే, ఆ ఆరోపణలను తెలుగు దంపతులు చంద్రశేఖర్ వల్లభనేని, అనుపమ ఖండించారు. పిల్లలను వారు బాధించలేదని, పిల్లవాడి పట్ల సరిగా వ్యవహరించి ఉండకపోవచ్చు గానీ బాధించలేదని, సహాయం కోసం వారు చూశారని, కానీ అది లభించలేదని అనుపమ తరఫు న్యాయవాది మార్టే బ్రోట్రోమ్ కోర్టు తీర్పునకు ముందు అన్నారు.
దంపతులను నార్వేలోని జైలులో పెట్టడం తప్పు అని ఆమె అన్నారు. కోర్టు వారికి శిక్ష వేస్తే తాము అపీల్ చేస్తామని ఆమె అన్నారు. పిల్లవాడు పాఠశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసిన తొమ్మిది నెలల తర్వాత పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. కొడుకుని మందలించిన కేసులో తల్లి అనుపమకు 15 నెలలు, తండ్రి చంద్రశేఖర్‌కు 18 నెలలు జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. ప్రాసిక్యూషన్ విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. దీనిని వారు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications