వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్, ములాయంకు ఎదురుదెబ్బ: డింపుల్‌కు ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dimple Yadav - Mulayam Singh Yadav
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్‌కు జాతీయ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో గురువారం ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ములాయం, ఆయన తనయుడు అఖిలేష్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) విచారణ కొనసాగించేందుకు సిబిఐకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అక్రమాస్తుల కేసులో తనపై సిబిఐ విచారణ చేయడాన్ని ములాయం సింగ్ యాదవ్ గతంలో సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన కోర్టు ఈ రోజు దానిని కొట్టి వేసింది. ములాయం సింగ్ ఆస్తుల పైన విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ కేసులో స్వతంత్ర దర్యాఫ్తు సాగించాలని సిబిఐని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసు నుండి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్‌కు మినహాయింపును ఇచ్చింది.

ములాయం సింగ్ మరో తనయుడు ప్రతీక్ యాదవ్ పైన కూడా విచారణను కొనసాగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ములాయం సింగ్ యాదవ్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో గురువారం ఉదయం భేటీ అయ్యారు. కాగా 2007 మార్చి 1వ తేదిన సుప్రీం కోర్టు ములాయం ఆస్తుల కేసుపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ములాయం ఆస్తులపై విచారణ కొనసాగుతోంది.

సుప్రీం కోర్టు తీర్పును ములాయం సింగ్ యాదవ్ స్వాగతించారు. సిబిఐ విచారణతో తనపై వచ్చిన ఆరోపణలు తొలగిపోతాయని తాను భావిస్తున్నానని చెప్పారు.

English summary
The Supreme Court has asked the CBI to continue with its probe into the disproportionate assets case against Mulayam Singh Yadav and Akhilesh Yadav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X