బొత్సను కుటుంబ సభ్యులే చెప్పుతో కొట్టాలి: అనురాధ

బొత్స పొరపాటున ఈ వ్యాఖ్యలు చేయలేదని, తప్పుగా మాట్లాడినందువల్లే తాను ఆవేశంగా స్పందించాల్సి వచ్చిందని ఆమె అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే మహిళలకు రక్షణ కరువైందని, ఇక దేశంలో మహిళల పరిస్థితేమిటని ఆమె ప్రశ్నించారు.
చట్టాలలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని నిందితులు సులభంగా తప్పించుకుంటున్నారని, చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛ ఉంది కదా అని స్త్రీలు అర్థరాత్రి రోడ్డు మీద తిరుగుతారా అంటూ బొత్స సత్యనారాయణ ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనపై అన్నారు. ఆ తర్వాత పొరపాటు గుర్తించి సరిదిద్దుకున్నారు.
బొత్స వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బొత్స వ్యాఖ్యలను తీవ్రంగా నిరసించారు. వి. హనుమంతరావు వంటి కాంగ్రెసు నాయకులు కూడా బొత్స సత్యనారాయణను తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications