చెట్టును ఢీకొన్న కారు: సిబిఐ జెడికి తప్పిన ముప్పు

జెడి లక్ష్మీ నారాయణతో పాటు ఆయన కుటుంబం కూడా అదే కారులో ప్రయాణిస్తోంది. జెడితో పాటు ఆయన కుటుంబం శ్రీశైలం నుండి వెళుతుండగా బ్రహ్మగిరి దగ్గర ఘాట్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు కొద్దిగా దెబ్బతిన్నది. అనంతరం జెడి తన కుటుంబంతో సహా కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు.
కాగా సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసు, ఓఎంసి కేసులను దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా కేసులకు సంబంధించి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలోని సిబిఐ అధికారులు ఇప్పటికి పలు ఛార్జీషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి తదితరులు ఇప్పటికే జైలులో ఉన్నారు.












Click it and Unblock the Notifications