తండ్రి పేరుతో పదవులు, లాలూచీ: వంగవీటి రాధాకృష్ణ

రాజకీయ లబ్ధి కోసమే
తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయ లబ్ధి కోసమే అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేశారని అనంతపురం జిల్లా ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అనంత జిల్లాలో అన్నారు. జగన్ కేసు విషయంలో సిబిఐ రాజ్యంగ స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే జోక్యం చేసుకొని, వైయస్ జగన్‌కు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
తెలంగాణ ఎంపీలవి డ్రామాలు
తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులవి అన్నీ రాజకీయ డ్రామాలేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ ఆర్టీసి చైర్మన్ గోనె ప్రకాశ రావు హైదరాబాదులో అన్నారు. తెలంగాణ ఎంపీలకు ఉన్న ఆఫర్లు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.
తమకు ఇతర పార్టీల నుండి ఆఫర్లు ఉన్నాయని స్వయంగా ఎంపీలే చెప్పడం సిగ్గు చేటు అన్నారు. వారికి ఉన్న ఆఫర్లు ఏమిటో చెబితే ప్రజలకు తెలుస్తుందన్నారు. ఎంపీలకు వచ్చిన ఆఫర్లు పదవుల కోసమా లేక ప్రత్యేక రాష్ట్రం కోసమా చెప్పాలని గోనె ప్రకాశ రావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications