ఢిల్లీ గ్యాంగ్ రేప్: మరింత దిగజారిన విక్టిమ్ ఆరోగ్యం

బాధితురాలు ఇంకా వెంటిలేటర్‌పైనే ఉంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడానికి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి సీనియర్ వైద్యులను, కార్డియాక్ సర్జన్‌ను పిలిపించారు. డాక్టర్ బిడి అథానీ లేకపోవడంతో సాయంత్రం నాలుగున్నర గంటలకు విడుదల చేయాల్సిన హెల్త్ బులెటన్‌ను పిఆర్వో విడుదల చేయలేదు.
బాధితురాలు మానసింగా బలంగా ఉందని, స్పృహలో ఉందని, మాట్లాడుతోందని వైద్యులు మంగళవారం చెప్పారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్‌నకు నిరసనగా ఢిల్లీ గత కొద్ది రోజులుగా అట్టుడికింది. ప్రభుత్వం వివిధ చర్యలు చేపడతామని చెప్పడంతో బుధవారం కాస్తా చల్లబడింది.
కాగా, ఆందోళనకారుల కారణంగానే కిందపడిపోయి మరణించాడని చెబుతున్న పోలీసు కానిస్టేబుల్ తోమర్ వ్యవహారం మరో మలుపు తీసుకుంటోంది. తోమర్ గుండెపోటుతో కింద పడిపోయి మరణించి ఉంటాడని అంటున్నారు.












Click it and Unblock the Notifications