సవిత మృతి: ఐర్లాండ్ సవరణపై కేథలిక్ చర్చి వ్యతిరేకత

కాగా యూరోపియన్ యూనియన్‌లో ఒక్క ఐర్లాండ్‌లోనే గర్భస్రావంపై నిషేధం ఉంది. గర్భస్రావం చేసేందుకు ఇక్కడి వైద్యులు తిరస్కరించడంతో పిండం మృతి చెంది, రక్తం కలుషితం కావడంతో ఇటీవల సవిత అనే భారతీయ మహిళ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. అబార్షన్ చేయకపోవడంతో సవిత మృతి చెందడం, ఇంటా, బయటా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఐర్లాండ్ ప్రభుత్వం అబార్షన్ పైన దిగొచ్చింది.
ఐర్లాండులో గర్భస్రావం చట్టాన్ని సవరిస్తున్నట్లు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. తల్లికి ప్రమాదకర పరిస్థితి ఏర్పడితే గర్భస్రావం చేయవచ్చుననే సవరణకు అక్కడి ప్రభుత్వంలోని అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఒకే చెబుతున్నారు. అయితే దీనిని కేథలిక్ చర్చి మతాధికారి మాత్రం వ్యతిరేకించాలని పిలుపునివ్వడం గమనార్హం.












Click it and Unblock the Notifications