ఫిల్మ్‌నగర్‌లో సెక్స్ రాకెట్ రట్టు: పట్టుబడ్డ యువతులు

అరెస్టయిన యువతులు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారిగా తెలుస్తోంది. వారిని కస్టడీకి తరలించారు. ఇరవై తొమ్మిదేళ్ల నిందితుడు ప్రసాద్ విశాఖపట్నంకు చెందిన వాడని, అతను కొద్ది రోజుల క్రితం పలువురు యువతులను తీసుకు వచ్చాడని పోలీసులు చెప్పారు.
కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో అతను పలువురు హై ప్రొఫైల్ కస్టమర్స్‌కు యువతులను ఎరవేసినట్లుగా తాము గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. తమకు ఈ సెక్స్ రాకెట్ పైన సమాచారం వచ్చిందని, వెంటనే తాము రెయిడ్ చేసి నిందితుడిని, యువతులను అదుపులోకి తీసుకున్నామని చెప్పాడు.
అరెస్టయిన ముగ్గురు యువతులు ఇరవైల్లో ఉన్నారని, వారిని పోలీసు స్టేషన్‌కు తరలించామని స్టషన్ ఇన్సుపెక్టర్ చెప్పారు. తాను ఈ ఫీల్డులో గత ఆరునెలలుగా ఉన్నట్లు నిందితుడు చెప్పాడన్నారు. తాము కేసును విచారిస్తున్నామని, ప్రసాద్‌కు ఎవరైనా భాగస్వాములు ఉన్నారా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications