అందంగా..మహిళలపై ప్రణబ్ కొడుకు: మండిపడ్డ సోదరి

కాగా అంతకుముందు అభిజిత్ ముఖర్జీ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎబిపి ఆనంద టివి ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిజిత్ ముఖర్జీ తన తండ్రి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నివాసం ఉండే రాష్ట్రపతి భవన్ ఎదుట మహిళలు ఆందోళన చేయడంపై స్పందించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో గ్యాంగ్ రేప్‌కు గురైన యువతికి న్యాయం జరిగేలా చూడాలని పెద్ద ఎత్తున మహిళలు రాష్ట్రపతి భవన్ ఎదుట, ఇతర ప్రాంతాల్లో ధర్నా చేసిన విషయం చేశారు.
దీనిపై అభిజిత్ స్పందిస్తూ... కొవ్వత్తుల ప్రదర్శన ప్యాషన్ అయిపోయిందని, ఢిల్లీ గ్యాంగ్ రేప్ పైన ఆందోళన చేస్తున్న వారంతా నిజమైన ఆందోళనకారులు కారని, నిజమైన వారే అయితే అలా ప్రవర్తించరని అన్నారు. విద్యార్థుల ముసుగులో ప్రతిపక్షాలు దీనిని చేపడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఆందోళన చేస్తున్న వారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను కూడా విద్యార్థినేనని, విద్యార్థులు ఎలా నడుచుకుంటారో తనకు తెలుసునన్నారు.
ఈ ఘటనపై ఆందోళన చేసేందుకు వస్తున్న కొందరు మహిళలు అలంకరించుకొని వస్తున్నారని, వారే టీవిల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారన్నారు. వారు అసలైన విద్యార్థులు కాదనేది తన అభిప్రాయమని, ఎందుకంటే తమను తాము విద్యార్థులుగా చెప్పుకుంటున్నప్పటికీ ఆ ఏజ్ గ్రూప్ మహిళలు సాధారణంగా విద్యార్థులగా ఉండరని చెప్పారు. ఈ వ్యాఖ్యలను లెఫ్ట్ నేత బృందాకారత్, కిరణ్ బేడీ ఖండించారు. కాగా తన వ్యాఖ్యలపై అబిజిత్ ముఖర్జీ తర్వాత క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications