అక్బరుద్దీన్‌ను అరెస్ట్ చేస్తాం: డిజిపి, ఈవ్‌టీజింగ్ చేస్తే...

లండన్‌లో ట్రీట్‌మెంటు తీసుకుంటున్నట్లుగా తెలిసిందన్నారు. అవసరమైతే ఇంటర్ పోల్ సహాయంతో కూడా అరెస్టు చేసేందుకు సిద్ధమన్నారు. భవిష్యత్తులో అక్బరుద్దీన్ బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మీడింగులకు ఆయనను అనుమతించమన్నారు. ఉర్దూ ట్రాన్సులేట్ చేసుకోవడం తదితర కారణాల వల్ల విచారణ కొద్దిగా ఆలస్యమైందని డిజిపి చెప్పారు.
ఈవ్ టీజింగ్ పైన..
ఎవరైనా ఈవ్ టీజింగ్ పైన ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేస్తామని అంతకుముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. మొదటిసారి ఈవ్ టీజింగుకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని, రెండోసారి పాల్పడితే రేప్ కేసును నమోదు చేస్తామన్నారు. ఈవ్ టీజింగులపై ఇక నుండి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అమెరికాలో 911 కాల్ సెంటర్ తరహాలో ఇక్కడ విధానం ఉంటుందన్నారు.
డిజిపి కార్యాలయంలో 108 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 100 నెంబర్‌ను బలోపేతం చేస్తామన్నారు. దాబాలలో మద్యం అమ్మకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతి కేంద్రంగా ఎర్ర చందనం కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications