హిందువు ఉఫ్అంటే: అక్బర్‌పై జగ్గారెడ్డి, అరెస్ట్‌కు విహెచ్

రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు అన్నదమ్ములుగా జీవిస్తున్నారని, వారి మధ్య మతపరమైన చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించవద్దన్నారు. అలా చేస్తే ఇరు వర్గాలు మజ్లిస్ పార్టీకి సమాధానం చెబుతాయన్నారు. హిందువులు ఉఫ్ అని ఊదితే అక్బరుద్దీన్ ఆ గాలిలో కొట్టుకు పోతాడన్నారు. హిందువుల మనోభావాలు మరోసారి దెబ్బతీయాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు.
మజ్లిస్ పార్టీతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే ఎవరైనా ఔటే అన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీని శాసనసభకు అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఖబర్దార్ అక్బర్ అన్నారు. అక్బరుద్దీన్ తండ్రి అప్పుడు మత ఘర్షణలు సృష్టించి నేతగా ఎదిగాడని.. ఇప్పుడు అక్బర్ కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనకు మంత్రి పదవి రాలేదని పార్టీ పెట్టారని, బిజెపిలో తనకు టిక్కెట్ ఇవ్వలేదని తెరాసలో చేరానని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు.
సిడిల రూపంలో పంపకం
అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల సిడిలను రూపంలో పంచుతూ మరింత రెచ్చగొడుతున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత నిరంజన్ అన్నారు. ఆయన ఈ రోజు డిజిపిని కలిసి దానిని అడ్డుకోవాలని వినతి పత్రం అందించారు.
అరెస్టు చేయాలి
అక్బరుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అసదుద్దీన్‌ను పోలీసులు కొడితే ఏం జరిగిందన్నారు. పోలీసులు నిద్ర పోతున్నారని, హోంమంత్రి భయపడుతున్నారని ఆయన విమర్శించారు. హిందువుల అంతు చూస్తామన్న, జైలు గోడలు బద్దలు కొడతామన్న ప్రభుత్వం స్పందించదా అన్నారు. కోటి సంతకాలతో జగన్ అక్రమాలకు పాల్పడలేదని చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తోందన్నారు. ప్రభుత్వం బలహీనంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications