హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడిన అరుణ హత్య మిస్టరీ: ఇద్దరి అరెస్టు, పరారీలో ఒకడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని మిత్రుడి ఇంట్లో జరిగిన అరుణ అనే విద్యార్థిని హత్య కేసు మిస్టరీ వీడింది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రభు, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు శివకుమార్ పరారీలో ఉన్నాడు. అతను చెన్నైలో గానీ ముంబైలో గానీ తల దాచుకుని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. శివకుమార్ ఇంట్లోనే ఆమె మరణించింది.

అరుణ మృతిపై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. ఆమెపై అత్యాచారయత్నం చేసి, హత్య చేసినట్లుగా పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శివకుమారే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అతను ఫోన్ స్విచ్ఛాప్ చేసి పెట్టాడు.

హైదరాబాదులోని చత్రినాకలో మిత్రుడి నివాసంలో 22 ఏళ్ల యువతి అరుణ ఆదివారంనాడు అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురాలిని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ ఇంగ్లీష్ చదివిన అరుణగా గుర్తించారు. శివకుమార్ అనే మిత్రుడి నివాసంలో సోమవారంనాడు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. శివ కూడా ఒయు నుంచి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నాడు.

క్రిస్ట్మస్ వేడుకల కోసం శివకుమార్ తల్లిదండ్రులు మెదక్ జిల్లా సిద్దిపేటకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. శివకుమార్ తల్లిదండ్రులు సోమవారం ఇంటికి తిరిగి వచ్చారు. వారు వచ్చి చూడడంతో అరుణ మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. పడక గదిలో యువతి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో శివకుమార్ తండ్రి మల్లేష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించాడు.

ఇంటిలో నెట్ హాల్ టికెట్ కనిపించింది. హాల్ టికెట్ ఆధారంగా మృతురాలిని పోలీసులు గుర్తించారు. శివకుమార్‌ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Osmania University former student Aruna murder mystery has been busted by Hyderabad police. Two persons were arrested in this case. Main accused Sivakumar is absconding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X