ఉమ్మడి రాజధానిగా అంగీకరించం: హరీష్, అంతు చూస్తాం: నాయని

తెలంగాణపై కాంగ్రెస్ తనంతట తాను నెల రోజుల గడువు విధించుకుందని, దానిపై ఇప్పుడు కసరత్తు చేస్తోందని, కోర్ కమిటీ సమావేశాలంటూ వంటకాలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. నెల తర్వాత తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు జెండాలు ఇక్కడ ఉండవని ప్రజలు అల్టిమేటమ్ ఇవ్వటం వల్లనే కేంద్రంలో కదలిక వచ్చిందని నాయని అన్నారు. కాంగ్రెస్ విజ్ఞతతో వ్యవహరించి సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ పార్టీకి అథోగతి పడుతుందని అభిప్రాయపడ్డారు.
ప్యాకేజీలు, కమిటీలు అంటున్నారని, రెండు రాష్ట్రాలకు ఒకే రాజధాని అని వివాదం పెడతారని అంటున్నారని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధాని అంటే సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు వాళ్లు ఎట్లా వస్తారు? ఇక్కడి నుంచి ఎట్లా వెళ్తారు ? ఇక్కడ ఎట్లా ఉంటారో చూస్తామని అడిగారు. హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాలు ఇస్తేనే ఒప్పుకుంటామని, అది కాకుండా ఏ పేచీ పెట్టినా డబుల్ పేచీ పెడుతామని, అంతు చూస్తామని ఆయన అన్నారు.
హైదరాబాద్ తెలంగాణ ప్రజల కష్టార్జితమని, తెలంగాణ ప్రజల చెమటతో నిర్మాణమైందని, హైదరాబాద్‌ను పొత్తులో పెట్టి తెలంగాణ ఇస్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ పక్ష ఉపనేత హరీష్‌రావు చెప్పారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో 1100ల రోజు తెలంగాణ సాధన రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద ఆయన మాట్లాడారు.ఐదేళ్ల పాటు పొత్తుల పెడ్తామన్నా ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో వాటా అడిగినా, ఆదాయంలో సొత్తు అంటే కుదురదని ఆయన అన్నారు. సీమాంధ్రలో కొత్త రాజధాని కట్టుకునే దాకా, అదీ మూడు నాలుగేళ్ల కంటే ఎక్కువ ఉండనివ్వమన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలన్నది సీమాంధ్ర ప్రజల కోరిక కాదని, కొద్ది మంది పెట్టుబడి దారులైన రాజకీయ నాయకుల డిమాండ్ అని విమర్శించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications