ప్రేయసికోసం మహలా, తాజ్ కూల్చాలి: జయప్రద ప్రత్యర్థి

ఉత్తర ప్రదేశ్‌లో మత ఘర్షణలు చెలరేగినప్పుడు కొందరు బాబ్రీ మసీదును కూల్చివేశారని కానీ, తాజ్ మహల్ కూల్చుతానంటే తానే ముందుండి వారిని నడిపించేవాడినని అన్నారు. నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తనను ఎంతగానో బాధించిందని ఆయన అన్నారు. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ... షాజాహాన్ తన భార్య ముంతాజ్‌కు గుర్తుగా తాజ్ మహల్ కట్టించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజల సొమ్మును షాజాహాన్ తన ప్రేయసికి గుర్తుగా కట్టిన తాజ్ మహల్ కోసం వినియోగించడం సరికాదన్నారు. తాజ్ మహల్ కూల్చడానికి ముందుకు వచ్చి ఉంటే తానే వారిని నడిపించేవాడినని అన్నారు. అదే రోజు అంతకుముందు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాజ్ మహల్ అందాల గురించి పొగిడారు.
జాయ్‌పీ ప్యాలెస్‌లో విదేశీ అతిథులకు తాజ్‌మహల్ గొప్పతనాన్ని అఖిలేష్ వివరించారు. మంత్రి ఆజం ఖాన్ మాత్రం తాజ్ మహల్ కట్టడంపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో కట్టిన తాజ్ మహల్‌ను కూల్చివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాజ్ మహల్‌ను ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తుంటారు.












Click it and Unblock the Notifications