సొసైటీ అధ్యక్షుల రింగ రింగా!: క్యాంప్‌లో గర్ల్స్ డ్యాన్సు

శనివారం రాత్రి అధ్యక్షులను అరకులోని ఓ రిసార్టుకు తీసుకు వెళ్లాయి. అయితే, అక్కడ వారికి బోర్ కొట్టకుండా ఉండేందుకు మందు, చిందు, మగువలతో డ్యాన్స్ ఏర్పాటు చేశారట. అరకు శివారులను ఓ రిసార్టులో వారిని ఉంచి మందు ఏర్పాటు చేశారు. రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారు. కొందరు మగువలను తీసుకు వచ్చి డ్యాన్సులు చేపించారట. దీంతో క్యాంపులో ఉన్న వారు కూడా తోడుగా డ్యాన్సులు చేశారు.
ఈ విషయం మీడియా కంటపడటంతో డ్యాన్సు చేస్తున్న అమ్మాయిలని వెంటనే అక్కడ నుండి పంపించే వేసినట్లుగా చెబుతున్నారు. దాదాపు రాత్రి పది గంటలకు ప్రారంభమైన ఈ రింగ రింగా చాలాసేపు కొనసాగినట్లుగా చెబుతున్నారు. మీడియాను చూసి పలువురు అక్కడి నుండి జారుకున్నట్లుగా చెబుతున్నారు.
కాగా సొసైటీ ఎన్నికల్లో పట్టు కోసం ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ వారిని కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలతో పాటు పార్టీలకతీతంగా స్థానికంగా ఒక్కటవుతున్నారు. తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల తెరాస-టిడిపి-వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యేందుకు కూడా సిద్ధపడ్డాయట.












Click it and Unblock the Notifications