హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లుంబినీ, గోకుల్ చాట్ పేలుళ్ల తరహాలోనే ఈ పేలుళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bomb blasts
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 2007లో జరిగిన రెండు బాంబు పేలుళ్ల తర్వాత గురువారం సాయంత్రం జరిగిన పేలుళ్ల సంఘటనే అతి పెద్దది. 2007 ఆగస్టు 25వ తేదీన హైదరాబాదులోని లుంబినీ అమ్యూజ్‌మెంట్ పార్కు, కోఠీలోని గోకుల్ చాట్ వద్ద వరుసగా బాంబులు పేలాయి. ఈ పేలుళ్లలో 42 మంది మరణించారు. మరో 54 మంది దాకా గాయపడ్డారు. మొదటి పేలుడు లుంబినీ వద్ద సాయంత్రం గం.7.45 నిమిషాలకు జరగగా, రెండో పేలుడు గం.7.50 నిమిషాలకు గోకుల్ చాట్ వద్ద జరిగింది.

గురువారంనాడు దిల్‌షుక్‌నగర్‌లోని రెండు థియేటర్ల వద్ద జరిగిన పేలుళ్లు కూడా సాయంత్రం 7 గంటల ప్రాంతంలోనే జరిగాయి. అప్పుడు ఆ రెండు చోట్ల పేలుళ్లు సంభవించిన తర్వాత మరో రెండు చోట్ల బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. హర్కత్ - ఉల్ - ఆల్ ఇస్లామీ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు అనుమానించారు.

లుంబినీ పేలుళ్ల కేసులో పోలీసులు ఏడుగురు నిందితులను దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. వీరంతా పాకిస్తాన్ కు చెందిన ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాదులు. వీరిలో నలుగురిని ముంబయి నుంచి తీసుకొచ్చి పోలీసులు విచారించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అనిక్, అక్బర్, ఫరూక్, షాజిక్ పోలీసుల అదుపులో ఉన్నారు.

లుంబినీ పార్కులో పేలుళ్లకు పథకం రచించిన సూత్రధారులు అమీర్ రజాక్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ కేసులో తమ అదుపులో ఉన్న నిందితులను 45 రోజుల పాటు ఆక్టోపస్ పోలీసులు విచారించారు. మొత్తం 159 మంది సాక్షులను విచారించారు.

హైదరాబాద్ విదేశీ ఉగ్రవాదులకు చర్యలకు నిలయంగా మారిందనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. గురువారంనాడు జరిగిన పేలుళ్లను టైమర్స్ ద్వారా ఆపరేట్ చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సున్నితమైన ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

English summary
The Hyderabad bombings refers to the incident in which two bombs exploded almost simultaneously on 25 August 2007 in Hyderabad, capital of the Indian state of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X