సాక్షి పత్రికపై జగన్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి నిప్పులు!

అలాంటి మేకపాటి సోదరులలో ఒకరైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా ఉంటుందని అందరూ భావించే సాక్షి పైన మండిపడ్డారట. నెల్లూరులో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారిందని అంటున్నారు. నెల్లూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని సాక్షి పేపరే నాశనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారట. తమకు చెందిన వార్తలు చిన్నవిగా ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట.
సాక్షిలో ఉండే వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాళ్లు కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇక్కడి సాక్షి ప్రతినిధి పైన తాము హైదరాబాదు కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే చెప్పడమే మానేశానని చెప్పారని చెబుతున్నారు. సాక్షి తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అయినా తమకు జనాలపై నమ్మకముందని మేకపాటి చంద్రశేఖర రెడ్డి చెప్పారు. కాగా, ఈ విషయం పార్టీ పెద్దలకు తెలిసినట్లుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications