గుడివాడపై బాలయ్య, ఆ రెంటిపై లోకేష్: ఎదురు దాడే!

Balakrishna-Nara Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేత, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లుగా చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించి ఆరు నెలలు దాటింది. పాదయాత్ర సందర్భంగా అప్పుడప్పుడు బాలయ్య వచ్చి బాబును కలుసుకున్నారు. అయితే, బాబు యాత్ర ఇప్పుడు గుడివాడ నియోజకవర్గానికి చేరుకున్న సమయంలో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని అంటున్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గంలో ఉంది. నియోజకవర్గం నుండి టిడిపి తరఫున 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్లారు. దీంతో అక్కడ ప్రత్యామ్నాయాన్ని చంద్రబాబు, బాలయ్యలు కలిసి చూశారు. ఎన్టీఆర్ పుట్టిన ఊరు ఇదే నియోజకవర్గంలో ఉండటం, జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి తెచ్చి టిక్కెట్ ఇప్పించిన కొడాలి.. జగన్ వైపు వెళ్లడంతో బాలయ్య దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

నియోజకవర్గంలో బాబు పాదయాత్రపై పార్టీ కార్యకర్తలు, నేతలతో బాలయ్య మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. ఒకరోజు ముందుగానే అక్కడకు చేరుకొని అందరితో సమీక్షలు జరుపుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో బాబుతో పాటు తాను విమర్శలు చేసేందుకు బాలయ్య సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు నారా లోకేష్.. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+