ప్రణబ్ బస వద్ద పేలుడు: హైదరాబాద్ కేసు ఎన్ఐఏకు

భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ ఘటనపై బంగ్లా ప్రధానికి ఫోన్ చేసి ఆరా తీశారు. కాగా ఇస్లామిక్ పార్టీ నేతకు మరణశిక్ష విధించడంతో బంగ్లాదేశ్‌లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా హింసాకాండ చెలరేగింది.
దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసు ఎన్ఐఏకు
దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసును రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించాలని నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి, ఎన్ఐఏ అధికారులు, ఇతర ఇంటెలిజన్స్ విభాగం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో నెలకొన్న ఉగ్రవాదం భయం దృష్ట్యా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసును ఎన్ఐఏకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడారు. ఎన్ఐఏ(జాతీయ దర్యాఫ్తు సంస్థ)కు దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసును అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఎన్ఐఏ పరిధి విస్తృతంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఘటనకు ఆస్కారం ఉందని అనుమానం ఉన్న ప్రాంతాలలో తనిఖీలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కేసు దర్యాఫ్తు వేగంగా జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ఎన్ఐఏ ఈపాటికే చురుగ్గా దర్యాఫ్తు జరుపుతోందన్నారు. కేసు దర్యాఫ్తు జరుగుతున్నందున ఇప్పుడే పూర్తి వివరాలు వెల్లడించలేమన్నారు. భద్రత విషయంలో పోలీసులు, ప్రభుత్వం వైఫల్యం లేదన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!