ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుంటా, ఇప్పట్లో కాదు: రాహుల్

తన కర్తవ్యం ప్రధాని మంత్రి పదవిని అధిరోహించడం కాదని, నిర్మాణాత్మక వ్యవస్థ రూపకల్పన అన్నారు. అధికార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. విపక్షంలో ఉండేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పార్టీతో పాటు కలిసి వచ్చే పార్టీలపై దృష్టి సారిస్తానని చెప్పారు. తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పారు. కానీ, ఏదో ఒకరోజు తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటానని చెప్పారు. వారసత్వాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, తన స్థానాన్ని తన పిల్లలకు ఇవ్వమని అడగనన్నారు.
కాగా, ఇటీవల జరిగిన జైపూర్ మేధోమథన సదస్సులో రాహుల్ గాంధీ కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. 2014లో యుపిఏ భాగస్వామ్య పక్షాల ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ఫోకస్ అవుతున్నారు. అయన ప్రధానమంత్రి అభ్యర్థిగా అంతకుముందు నుండే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఉపాధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంతో ప్రధాని అభ్యర్థి ఆయనే అనే వాదనకు మరింత బలం చేకూరుంది.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తనకు ప్రధాన మంత్రి పదవిపై ఆసక్తి లేదని చెప్పడం గమనార్హం. ఓ సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవి మరో మూడు నాలుగు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు ఎన్నికలకు పోయి ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ను ప్రకటిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications