మా వాళ్లను చూడండి!: చిరంజీవి లాబీయింగ్, అలక

కోటగిరి విద్యాధర రావు, గౌతమ్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వాల్సిందిగా చిరంజీవి బొత్సకు సూచించినట్లుగా సమాచారం. చిరంజీవి కోటగిరికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారట. ఒకవేళ సామాజిక సమీకరణాలు కుదరకపోతే గౌతమ్‌కు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట. మరోవైపు కాంగ్రెసు ఎమ్మెల్సీల జాబితా ఇప్పటికే ఖరారైనట్లుగా చెబుతున్నారు. అందులో చిరంజీవి సూచించిన పేరు లేదు. ఐదుగురి పేర్లను మాత్రమే ఇప్పటి వరకు ఖరారు చేశారు. మరో అభ్యర్థిగా చిరంజీవి సూచించిన వారి పేరు లిస్టులో ఉంటుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.
చిరంజీవి అలక
చిరంజీవి ఎంతగా ప్రయత్నాలు చేసినప్పటికీ తాను ప్రతిపాదించిన ఇద్దరిలో ఒక్కరికి అవకాశం రాకపోయేసరికి అలకబూనారట. కోటగిరి, గౌతమ్‌లకు సామాజిక సమీకరణాలు కుదరకపోవడం వల్లనే ఇవ్వలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో చిరంజీవి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారట.
కాగా, ఇప్పటికే ఎమ్మెల్సీల అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారై పోయినట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఖమ్మం నుండి పొంగులేటి సుధాకర్ రెడ్డి, కరీంనగర్ నుండి సంతోష్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా నుండి లక్ష్మీ శివ కుమారి, విజయనగరం నుండి కోలగట్ల వీరభద్ర స్వామిలను ఎంపిక చేశారు. అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఖరారైందనే వార్తలు వచ్చినప్పటికీ చిరంజీవి సహా పలువురు లాబీయింగ్ మాత్రం చేస్తూనే ఉన్నారట. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పలువురు వరుసగా భేటీ అవుతున్నారు. మంత్రి రామచంద్రయ్య, కంతేటి సత్యనారాయణష భారతి రాగ్యానాయక్, షబ్బీర్ అలీ, కోలగట్ల వీరభద్ర స్వామిలు బొత్సతో భేటీ అయ్యారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications