హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ ఆదుకున్నారు: జగన్‌ను కల్సిన మాజీ ఎమ్మెల్యే

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఖమ్మం జిల్లా సిపిఐ మాజీ శాసన సభ్యుడు పి.వెంకటేశ్వర్లు కలిశారు. మంగళవారం ఉదయం ములాకత్ సమయంలో వైయస్ జగన్‌ను వెంకటేశ్వర్లు కలిశారు. పార్టీ అధినేతను కలిసిన అనంతరం అతను విలేకరులతో మాట్లాడారు.

జగన్‌ను టిడిపి, కాంగ్రెసు పార్టీలు కుట్రపూరితంగా కేసులలో ఇరికించాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ను తప్పకుండా ముఖ్యమంత్రిగా చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీదే విజయమన్నారు. తాను అన్ని విధాలుగా జగన్‌కు మద్దతుగా నిలుస్తానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నారని చెప్పారు.

వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు చేరువయ్యాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు అన్ని మద్దతు పలికినా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మద్దతివ్వకుండా మోసం చేసిందని విమర్శించారు.

బాబును నమ్మరు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత తోపుదుర్తి కవిత అనంతపురం జిల్లాలో అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడుతూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. వైయస్ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారన్నారు.

విప్ ధిక్కరించిన వారిపై చర్యలు

అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ధిక్కరించిన వారిపై చర్యలుంటాయని కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు మస్తాన్ వలీ అన్నారు. గీత దాటిన ఎమ్మెల్యేల పైన స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

English summary
Khammam district Former CPI MLA P.Venkateshwarlu has met YSR Congress Party chief YS Jaganmohan Reddy in Chanchalguda jail on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X