• search
For hyderabad Updates
Allow Notification  

  బాబ్లీపై కడిగేశాం!: టిడిపి, నేతల ఆరోగ్యం ఆందోళనకరం

  By Srinivas
  |

  హైదరాబాద్: బాబ్లీ ప్రాజెక్టు పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం మధ్యాహ్నం ముగిసింది. సమావేశం అనంతరం టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, కడియం శ్రీహరి మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టుపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు న్యాయసలహాలు తీసుకుంటామని చెప్పారన్నారు.

  ప్రతిపక్షాల సూచనలు పరిగణలోకి తీసుకొని మరోసారి అఖిల పక్షం నిర్వహిస్తామని చెప్పారన్నారు. బాబ్లీ ప్రాజెక్టుపై వేసిన త్రిసభ్య కమిటీ కేంద్రం పరిధిలో పని చేసేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో త్రిసభ్య కమిటీ ఉండవద్దన్నారు. ఒక్క ప్రాజెక్టు అంతర్భాగంలో మరో ప్రాజెక్టు నిర్మించడం ఎక్కడా జరగలేదన్నారు. బాబ్లీ విషయంలో ప్రభుత్వానికి తాము కనువిప్పు కలిగించామన్నారు.

  అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు ప్రభుత్వం తీసుకు వెళ్లాలన్నారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం సరైన వాదనలు వినిపించక పోవడం వల్లనే రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. మహారాష్ట్ర ఒప్పందాన్ని ఉల్లంఘించి 60 టిఎంసిలకు బదులు వంద టిఎంసిల నీటిని ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు. ఓ వైపు కోర్టులో పోరాడుతూనే మరోవైపు రాజకీయ పరిష్కారానికి కృషి చేయాలని జూలకంటి రంగారెడ్డి సూచించారు.

  CM promises on Babli Project

  ప్రభుత్వం కళ్లు మూసుకొని లేదు

  సమస్యల విషయంలో ప్రభుత్వం కళ్లు మూసుకొని లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వేరుగా అన్నారు. 2009 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటి అర తప్ప అన్ని నెరవేర్చామని, కొత్త పథకాలు కూడా ప్రారంభించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. మేనిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా కొన్నింటిని అమలు చేస్తున్నామన్నారు.

  దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేల పరిస్థితి విషమం

  విద్యుత్ సమస్యపై పాత ఎమ్మెల్యే క్వార్టర్సులో దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలలో పదిమంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని రాత్రి వరకు ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. జైపాల్ యాదవ్, సీతక్క, సత్యవతి రాథోడ్, దేవినేని ఉమామహేశ్వర రావు, శ్రీరాం తాతయ్య, నారాయణ రెడ్డి, ఆంజనేయులు, సిఎం రమేష్ తదితరుల పరిస్థితి విషమంగా ఉంది.

  పార్ట్ టైం పొలిటిషియన్స్ విమర్శిస్తున్నారు

  వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోని పార్ట్ టైం పొలిటిషియన్స్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్నారని రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. టిడిపి బ్లాక్ పేపర్ ఇస్తే ప్రభుత్వం నుండి కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి స్పందన వచ్చిందన్నారు.

  వేసవి విడిదికి మంత్రులు

  వేసవి విడిది కోసం మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, విశ్వరూప్, కాసు వెంకట కృష్ణ రెడ్డి, గంట శ్రీనివాస రావులు ఈ రాత్రికి రష్యా వెళ్లనున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  మరిన్ని హైదరాబాద్ వార్తలుView All

  English summary
  Telugudesam Party senior leaders Errabelli Dayakar Rao and Kadiyam Srihari said on Thursday that CM Kiran Kumar Reddy has promised to opposition on Babli Project issue.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more