వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసిపిది ఆత్మహత్య కాదు, ప్రమాదం: భార్య సుస్మిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Sanjay Banerjee
ముంబై: మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బలగాలకు చెందిన డిసిపి సంజయ్ బెనర్జీది ఆత్మహత్య కాదని, ప్రమాదవశాత్తు పిస్టల్ పేలి చనిపోయాడని ఆయన భార్య సుస్మిత చెప్పారు. థానే రెస్టారెంట్‌లో మధ్యాహ్న భోజనానికి కుటుంబ సభ్యులతో పాటు వెళ్లిన సంజయ్ బెనర్జీ పిస్టల్ పేలి మరణించిన విషయం తెలిసిందే.

జేబు నుంచి దస్తీ తీస్తుండగా పిస్టల్ బయటకు వచ్చి పేలి తలలోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి పడిపోయిందని ఆమె పోలీసులకు చెప్పారు. ఈ వాంగ్మూలం ఆమె ఇంతకు ముందు చెప్పిన మాటలకు భిన్నంగా ఉన్నాయి. దర్యాప్తు కొనసాగిస్తున్నామని, దర్యాప్తు పూర్తయితే గానీ ఏం జరిగిందనేది చెప్పలేమని థానే పోలీసు కమిషనర్ కెపి రఘువంశీ అన్నారు.

సుస్మిత తాజాగా చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవని, సంజయ్ బెనర్జీ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారని సుస్మిత ఇంతకు ముందు చెప్పారని, ఆయుధాల గురించి సంజయ్‌కు బాగా తెలుసునని, అలాంటి పొరపాటు అతను చేస్తాడని అనుకోలేమని అంటున్నారు.

పోలీసులు సంఘటన జరిగిన నాటి కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఆ రోజు సంజయ్‌తో మాట్లాడినవారిని ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలను పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. సంజయ్ బెనర్జీ ఆ రోజు రెస్టారెంట్‌కు కుటుంబ సభ్యులతో భోజనానికి వెళ్లి, కుటుంబ సభ్యుల ముందు తన రివాల్వర్‌తో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, అది ఆత్మహత్య కాదని ఆయన భార్య సుస్మిత ప్రస్తుతం అంటున్నారు.

English summary
Anti-terrorism squad DCP Sanjay Banerjee's wife, Sushmita, has told investigators that her husband did not commit suicide but died after his pistol went off accidentally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X