వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం చెప్పలేదే: విద్యుత్ ఛార్జీలపై బొత్స వింత వాదన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వింత లాజిక్ లాగారు. సామాన్యుల పైన విద్యుత్ ఛార్జీల భారం పడనియమని చెబుతూనే.. 2009 ఎన్నికలకు ముందు తాము విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎక్కడా చెప్పలేదని ఆదివారం అన్నారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు.

రైతు శ్రేయస్సే కాంగ్రెసు పార్టీ ప్రధాన ధ్యేయం అన్నారు. విద్యుత్ ఛార్జీల భారం సామాన్యులు, రైతులపై పడకుండా ఉండే దిశలోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సాగుతుందని తాను గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ నేతగా విద్యుత్ ఛార్జీల భారం వేయవద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు చెప్పారు. ఛార్జీలు పెంచబోమని 2004 మేనిఫెస్టోలో తమ పార్టీ చెప్పిందన్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో చెప్పలేదన్నారు.

తమ మేనిఫెస్టోలో గానీ, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కాని ఎక్కడా ఛార్జీలు పెంచమని చెప్పలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. రైతులపై విద్యుత్ పెంపు భారం పడనీయమన్నారు. విపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆందోళనలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి మధ్య 62 మిలియన్ యూనిట్ల వ్యత్యాసం ఉందన్నారు.

సెట్ టాప్ బాక్సులపై కేంద్రానికి లేఖ

టివిలకు సెట్ టాప్ బాక్సులు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఈ నెలాఖరుతో(ఈరోజుతో) సెట్ టాప్ బాక్సులు పెట్టించుకునే గడువు తేది ముగియనుంది. ఈ నేపథ్యంలో కిరణ్ కేంద్రానికి లేఖ రాస్తూ.. మరో నెల గడువు ఇవ్వాలని కోరారు. విశాఖ, హైదరాబాద్ పట్టణాలలో మరో యాభై లక్షల మంది సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.

భారం పడకుండా చూస్తాం

పేదవారిపై విద్యుత్ భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విద్యుత్ సబ్సిడీ కోసం బడ్జెట్‌లో రూ.5700 కేటాయించామన్నారు. విద్యుత్ ఛార్జీలపై ఈఆర్సీ ఆదేశాలు పరిశీలిస్తామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలపై నాలుగు, ఐదు తేదీల్లో హైదరాబాదులో సమావేశం ఉంటుందని చెప్పారు.

English summary
PCC chief and Transport minister Botsa Satyanarayana said on Sunday that they never promised on power charges in 2009 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X