ఫ్లెక్సీలో ఎన్టీఆర్: పెట్టుకోవచ్చు కానీ.. జగన్ పార్టీ వివరణ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోను పెట్టుకునే హక్కు ఆయన అభిమానులకు ఉందని కొణతాల అన్నారు. గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని మొదటి నుండి ఎన్టీఆర్ అభిమాని అని చెప్పారు. అభిమానిగా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవచ్చునని చెప్పారు. అయితే, ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవడం నాని వ్యక్తిగత విషయమన్నారు. దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
కాగా, 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని కొద్ది నెలల క్రితం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్ర విమర్శలు చేసిన కొడాలి నాని బయటకు వెళ్లారు.
అయితే, ఆయన తన ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోను కూడా ఆయన ఉపయోగిస్తున్నారు. దీనిని తెలుగుదేశం తీవ్రంగా ఖండిస్తోంది. అయితే, దాంతో తమకు సంబంధం లేదని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు, అది కొడాలి నాని వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది.












Click it and Unblock the Notifications