జగన్, నన్నుఅడ్డుకునే మగాడు పుట్టలేదు: కొడాలి నాని

Kodali Nani
విజయవాడ: తనను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునే మగాడు పుట్టలేదని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని శనివారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలో జరిగింది. ఈ సందర్భంగా గుడివాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొడాలి నాని మాట్లాడారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరన్నారు. అలాగే తనను అసెంబ్లీకి వెళ్ళకుండా అడ్డుకునే మగాడు ఈ భూమ్మీద పుట్టలేదన్నారు. తనను ఓడించేందుకు మహామహులంతా ఒక్కటై పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు బొమ్మ పెట్టుకున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన చెంచాలతో అనవసరమైన రాద్ధాంతం చేయిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకుడైన చంద్రబాబుకే ఫొటో పెట్టుకునే అర్హత లేదన్నారు. తాను భవిష్యత్‌లో కూడా ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకునే రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు.

జగన్ పార్టీ దీక్షలపై టిడిపి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు విద్యుత్ చార్జీల తగ్గింపు కోసం దీక్ష చేస్తున్నారా? లేక తమపై అనర్హత వేటు వేయించుకోవడం కోసం చేస్తున్నారా? అని తెలుగుదేశం పార్టీ విస్మయం వ్యక్తం చేసింది. దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుందని, విద్యుత్ చార్జీలు తగ్గించాలని దీక్షకు కూర్చుని దానిని వదిలి తమ దీక్షను చూసి అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు లేఖ రాయడం ఏమిటని, వాళ్ల దీక్ష దేనికోసమని, అనర్హత వేటు వేయించు కోవడానికే దీక్ష చేస్తున్నట్లుగా ఉందని టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+