తల నరుక్కుంటా గానీ మాట తప్పను: కెసిఆర్

తెలంగాణ దుఖ్కం ఒడవని కథ అని ఆయన అన్నారు. ఆరునూరైనా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి తీరాలని, లేదంటే తరతరాలుగా తెలంగాణ ప్రజలు బానిసత్వంలో మగ్గాల్సి వస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉపాధ్యాయ లోకం తీవ్రంగా శ్రమిస్తోందని ఆయన అన్నారు. విద్యారంగంపై మంత్రులు తలాతోక లేని మాటలు చెబుతున్నారని ఆయన విమర్శించారు.
విద్యార్థి జీవితంలో తెలంగాణ కోసం తాను దెబ్బలు తిన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఐదవ తరగతి చదువుతున్న పిల్లాడు కూడా తెలంగాణ ఎందుకు కావాలంటే గంట ఉపన్యాసం ఇస్తాడని ఆయన అన్నారు 1956లోనే ఆంధ్రా తెలంగాణ విలీనాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన చెప్పారు. సమాజంలో ఉపాధ్యాయ పాత్ర చాలా గొప్పదని ఆయన అన్నారు
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కెజి నుంచి పిజి దాకా ఉచిత విద్యను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని ఆయన చెప్పారు. పదవీ విరమణ సందర్భంగా రవీందర్ రావు దంపతులను కెసిఆర్ సత్కరించారు.












Click it and Unblock the Notifications