బాబాయ్ కొట్టినందువల్లే పారిపోయా: సినీ నటి అంజలి

కాగా, నటి అంజలి అదృశ్యంపై మిస్టరీ వీడిన విషయం తెలిసిందే. తాను సురక్షితంగా ఉన్నట్టు తల్లి పార్వతి దేవికి స్వయంగా అంజలి ఫోన్ చేసి చెప్పినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. పిన్ని భారతీదేవి, బాబాయ్ సూరిబాబు, తమిళ దర్శకుడు కళంజియంలతో విబేధాలున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఒక హోటల్ నుంచి ఆమె రెండురోజుల క్రితం చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు.
ప్రస్తుతం అంజలి ఒక సినీ నిర్మాత రక్షణలో ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు అంజలి అదృశ్యం కాలేదని, ఇష్టపూర్వకంగానే హోటల్ నుంచి వెళ్లిపోయారని హైదరాబాద్ పశ్చిమమండలం డిసిపి జి.సుధీర్‌బాబు తెలిపారు. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఆమె తాను క్షేమంగా ఫలానా చోట ఉన్నానంటూ తమకు సమాచారం ఇచ్చాక చట్టప్రకారం చర్యలు చేపడతామన్నారు.












Click it and Unblock the Notifications