జగన్ పార్టీలో మేకపాటి చిచ్చు!: కాకాని రాజీనామా

ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా కన్వీనర్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జడ్పీ మాజీ చైర్మన్ కాకాని గోవర్దన్ రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశమైంది. అసంతృప్తితోనే కాకాని వైదొలిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, కాకాని చెప్పే రాజీనామా చేశారని, ఎలాంటి విభేదాలు లేవని పార్టీ చెబుతోంది.
మరోవైపు సర్వేపల్లిలో పార్టీని బలోపేతం చేసేందుకు సమయం కావాలని, అందుకనే జిల్లా కన్వీనర్ పదవి నుంచి తప్పుకొంటున్నానని కాకాని వివరించారు. జిల్లా బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని అధిష్ఠానాన్ని కోరగా, గ్రీన్‌సిగ్నల్ లభించడంతో తప్పుకొంటున్నానని తెలిపారు.
పార్టీలో విభేదాల వల్లే తప్పుకొంటున్నాననే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జగన్ పార్టీ స్థాపించాక తొలి కన్వీనర్‌గా తనను నియమించారని చెప్పారు. తామంతా మేకపాటి నాయకత్వంలోనే పని చేస్తున్నామని స్పష్టంచేశారు. తానూ ఆయన మనిషినేనన్నారు.












Click it and Unblock the Notifications