కాంగ్రెస్ ఫ్లెక్సీలో ఎన్టీఆర్: బాబుతో నందమూరి హీరో భేటీ

NT Ramarao
అనంతపురం/విశాఖపట్నం: స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమ ఫ్లెక్సీలలో ఉపయోగించుకొని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జగన్ పార్టీ తర్వాత ఇప్పుడు కాంగ్రెసు పార్టీ కూడా సీనియర్ ఎన్టీఆర్ ఫోటోను వినియోగించుకుంటోంది! అనంతపురం జిల్లాలో మంత్రి శైలజానాథ్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫోటో కూడా ఉంది.

అనంతపురంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెసు నేతలు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో శైలజానాథ్‌తో పాటు స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటోను పొందుపర్చడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ శ్రీరాముడి రూపంలో ఉన్న ఫోటోను పెట్టారు. శ్రీరామ నవమి పండుగ నేపథ్యంలో శ్రీరాముడి రూపంలో ఉండటం వల్లనే పెట్టారని కొందరు చెబుతున్నప్పటికీ, ఎన్టీఆర్ గెటప్ ఫోటో పెట్టటం చర్చనీయాంశమైంది.

చంద్రబాబును కలిసిన తారకరత్న

విశాఖపట్నంలో వస్తున్నా మీకోసం పాదయాత్ర నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న మంగళవారం కలిశారు. చంద్రబాబును కలిసిన తారకరత్న ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు.

కాగా, పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని చంద్రబాబు అన్నారు. ఉక్కు పరిశ్రమను బయ్యారంలోనే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుకు ఓబుళాపురం గనుల కేటాయించాలని తాను సూచిస్తే వైయస్ రాజశేఖర రెడ్డి పట్టించుకోలేదన్నారు. ఎన్డీయే హయాంలో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను తాను అడ్డుకున్నానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+