గాలి కూల్చిన సుంకులమ్మ గుడి కింద బంగారం నిధి?

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బ్లాక్ గోల్డ్ మైన్స్‌లో నిల్వ చేసిన ఇనుప ఖనిజాన్ని గత కొన్ని రోజులుగా తరలిస్తున్నారు. ఆదివారం అక్కడి నిల్వలను లారీల్లో ఎక్కిస్తుండగా... జెసిబి డ్రైవర్ పొరపాటున సుంకులమ్మ గుడి ప్రదేశంలో గుట్టను తవ్వే ప్రయత్నం చేసినప్పుడు బంగారం నిధి కనిపించిందట.
దీంతో హడావుడిగా దాన్ని మళ్లీ మట్టితో కప్పేసి ఇనుప ఖనిజాన్ని తరలించడానికి తీసుకు వచ్చిన లారీలను ఖాళీగా వెనక్కి తిప్పి పంపించినట్లుగా పోలీసులకు సమాచారం అందిందట. సుంకులమ్మ గుడి ప్రదేశంలో బంగారం గనులు ఉన్నాయని తెలియడంతో ఈ విషయాన్ని వారు రహస్యంగా ఉంచారు.
అంతేకాకుండా రాత్రిళ్లు సైతం గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన వారు రహస్యంగా గతంలో సుంకులమ్మ గుడి ఉన్న ప్రదేశంలోనే ఇరవై నాలుగు గంటలు కాపలా కాస్తున్నట్లుగా స్థానిక ప్రజలు పోలీసులకు చెప్పారు. సుంకులమ్మ గుడి కింద బంగారం నిధులు ఉన్నాయనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. గాలికి బంగారం నిధులు ఉన్నాయని తెలిసే గుడిని కూలగొట్టారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.












Click it and Unblock the Notifications