ముడుపులు: అద్వానీపై తీవ్ర ఆరోపణ, యడ్డీ క్షమాపణ

అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి నేతలకు లేదని, ఆ పార్టీ అగ్రనేత అద్వానీతో సహా బిజెపి నేతలంతా యడ్యూరప్ప వద్ద ముడుపులు అందుకున్నవారేనని, ఇలా డబ్బులు మింగి దగా చేశారని ధ్వజమెత్తింది. బెంగళూరులో సోమవారం ఆ పార్టీ సీనియర్ నేత, యడ్యూరప్ప అనుచరుడు ధనుంజయకుమార్ మీడియాతో మాట్లాడారు. అక్రమ గనుల వ్యవహారంలో లోకాయుక్త నివేదిక వెలుగు చూసిన తర్వాత యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించేందుకు అద్వానీతో సహా పలువురు పార్టీ జాతీయ నేతలు కోట్లాది రూపాయల ముడుపులందుకున్నారని చెప్పారు.
ఎవరికి ఎంత మొత్తం ముట్టజెప్పిందీ తమ వద్ద తగిన ఆధారాలున్నా యన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే యడ్యూరప్ప ముడుపులు చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. అయినా కూడా కృతజ్ఞత ఏమాత్రం లేని జాతీయ నేతలు ఆయన పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ సీరియస్‌గానే ఎన్నికల బరిలోకి దిగిందని, 200 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించిందని ఆయన పేర్కొన్నారు.
కాగా, ధనంజయ్ కుమార్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘానికి బిజెపి ఎమ్మెల్సీ మధుసూదన రావు ఫిర్యాదు చేశారు. ధనుంజయ్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనన్నారు. ఆయన ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో కూడినవని ధ్వజమెత్తారు. ధనంజయ కుమార్‌కు ఈసి నోటీసులు జారీ చేసింది.
యడ్యూరప్పను పార్టీ విడిచి వెళ్లాలని తాము ఎప్పుడూ ఆదేశించలేదని, ఆయనే పీకల్లోతు అవినీతిలోకూరుకుపోయి ముఖం చూపలేక పార్టీని వీడారని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ పేర్కొన్నా రు. బెల్గాంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పులు చేసేవారికి పార్టీ లో స్థానం లేదని అంటూనే ఒక వేళ పశ్చాత్తాపం చెందితే క్షమించి అక్కున చేర్చుకునే దయాగుణం తమ పార్టీ సొంతమన్నారు.
యడ్డీ క్షమాపణ
అద్వానీపై తమ పార్టీ నేత ధనంజయ కుమార్ చేసిన ఆరోపణలకు పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప క్షమాపణలు చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications