మహారాజశ్రీ.. రాజమార్తాండ: బిరుదుల గుట్టు(పిక్చర్స్)
హైదరాబాద్: పూర్వాకాలంలో రాజులకు, కవులకు, ఇతర రంగాల్లో ప్రావీణ్యం సంపాదించిన వారిని బహుమానాలు, బిరుదులు వరించేవి. ఇప్పుడు కూడా పలువురు నేతలను బిరుదులు వరిస్తున్నాయి. అయితే, వాటిని కొనుక్కుంటున్నారని, ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రణాళికను తీసుకు వచ్చింది. దీంతో కిరణ్ దళితులకు ఎంతో చేస్తున్నారని చెబుతూ కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనకు దళిత బంధువు అంటూ బిరుదును ఇచ్చారు. రాజమండ్రిలో జరిగిన సభలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సహా పలువురు పాల్గొన్నారు. కిరణ్ దళితులకు ఎంతో చేస్తున్నారని పార్టీకి చెందిన పలువురు నేతలు కొనియాడారు. దీనిపై విపక్షాల నుండి విమర్శలు కూడా అంతేస్థాయిలో వచ్చాయి.
రాజ్యసభ సభ్యుడు, వచ్చే ఎన్నికల్లో విశాఖ టిక్కెట్ ఆశిస్తున్న టి.సుబ్బిరామి రెడ్డికి ఇటీవల 'విశ్వ విఖ్యాత సంస్కృతీ సార్వభౌమ' అనే బిరుదును ఇచ్చారు. దీని పైనా విమర్శలు లేకపోలేదు. రెండు నెలల క్రితం కుంభమేళా సందర్భంగా రాసలీలల నిత్యానంద స్వామిని నాగా సాధువులకు చెందిన మహా నిర్వాణి అఖాడా సన్మానించి మహా మండలేశ్వర హోదాను ఇచ్చారు. దీనిని నిత్యానంద కొన్నారనే విమర్శలు వచ్చాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇటీవల దళిత బంధు బిరుదును ఇచ్చారు. కిరణ్ దళితులకు తన హయాంలో ఎంతో చేస్తున్నారని కాంగ్రెసు నేతలు ఆయనకు దీనిని ఇచ్చారు. దళిత బంధు కాదని రాబందు అని విపక్షాలు విమర్శించాయి.

విశాఖ సీటుపై కన్నేసిన టి.సుబ్బిరామి రెడ్డికి ఇటీవలే 'విశ్వ విఖ్యాత సంస్కృతి సార్వభౌమ' బిరుదును ఇచ్చారు. టిఎస్సార్ ఫిల్మ్ అవార్డ్సుల సమయంలో దీనిని ఇచ్చారు. ఈ బిరుదు వెనుక గుట్టు దాగి ఉందనే విమర్శలు ఉన్నాయి.

వివాదాల నిత్యానంద స్వామికి మహా కుంభమేళాలో నాగా సాధువులు మహా మండలేశ్వర హోదాను ఇచ్చారు. నిత్యానందకు బిరుదులు, పదవులు కొనడం అనే విమర్శలు వచ్చాయి.

బిరుదులు కాకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడును స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ఉన్న నేతగా, వైయస్ రాజశేఖర రెడ్డిని హరితాంధ్రప్రదేశ్ విజన్ నేతగా ఆయా పార్టీల నేతలు అభివర్ణించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications