ఒక్కమగాడు.. అంతలేదు!: చిరు సిఎంపై సిఆర్సీXగండ్ర

చిరంజీవిని కాంగ్రెసు పార్టీ సరిగా వాడుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి చిరంజీవి ఒక్కడే ప్రధానంగా కనిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. చిరంజీవిని మించిన నేత లేడన్నారు. కాంగ్రెసు పార్టీకి చిరు అవసరముందన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన కూడా ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రివర్గ నిర్ణయాలు ఆయన సొంత వ్యవహారాలు కాదన్నారు. కేబినెట్లో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
గండ్ర కౌంటర్
చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఓ సీనియర్, ముఖ్యమైన నేత మాత్రమేనని గండ్ర వెంకటరమణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న సి.రామచంద్రయ్య వ్యాఖ్యల్లో తప్పులేదని గండ్ర అన్నారు. అది చిరంజీవి పైన ఆయనకు ఉన్న అభిమానం అన్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిని తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. టిడిపి సీనియర్ నేత దాడి వీరభద్ర రావు పార్టీని మారటం నైతిక విలువలు దిగజారడమే అన్నారు. తాను గేట్లు తెరిస్తే చాలామంది నేతలు టిడిపిలోకి వస్తారన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. బాబు గేట్లు తెరిస్తే టిడిపిలో చంద్రబాబు, లోకేష్ తప్ప ఎవరి మిగులరన్నారు.












Click it and Unblock the Notifications