కాంగ్రెస్ పార్టీలోకి గజల్ శ్రీనివాస్: ఎన్నికల్లో పోటీకి నో

ఈ నెల 12న కాంగ్రెసు పార్టీ పెద్దల సమక్షంలో గాంధీ భవనంలో ఆయన కాంగ్రెసు సభ్యత్వం తీసుకోనున్నారు. పార్టీలో చేరేకంటే ముందుగా అతను ఈ నెల 8న ఢిల్లీలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌ను కలువనున్నారు.
కాగా, గజల్ శ్రీనివాస్ తెలుగు గజల్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇతని స్వగ్రామం. ఇతని అసలు పేరు కేశిరాజు శ్రీనివాస్. 1986 నుండి తెలుగులో గజల్స్ గానం చేస్తూ, దేశంలోనే కాకుండా ప్రపంచంలోనేగానం చేస్తున్నారు.
హార్మోనియం, తబలా, సరోద్‌ల వంటి ప్రక్క వాయిద్యాల సహకారం లేకుండా కేవలం కంజీరాను సహ వాయిద్యంగా ఉపయోగిస్తూ, దానిని తానే వాయిస్తూ శృతి లయాత్మకంగా గానం చేయడం విశేషం. ఇతను ఆంధ్రా యూనివర్సిటీ నుండి బిఏ పూర్తి చేశారు. ఇతని తల్లిదండ్రులు రత్నావళి, నరసింహ రావు. భార్య సురేఖ, ఒక కూతురు సంస్కృతి. ఈ పాప మూడో ఏటి నుండే తండ్రితో పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications